: వయస్సుతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకున్నాను: ప్రియాంక చోప్రా
వయస్సుతో పాటు తన ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుకున్నానని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పేర్కొంది. అయితే, తాను చిన్నవయస్సులో ఉన్నప్పుడు ‘నేనేమీ చేయలేను... సాధించలేను అనే ఆత్మన్యూనతా భావంతో ఉండే దానిని’ అని నాటి విషయాలను గుర్తుచేసుకుంది. అయితే, కాలక్రమంలో దాని నుంచి బయటపడ్డానని ఆమె చెప్పింది. కాగా, బాలీవుడ్ లో దూసుకెళ్తున్న హీరోయిన్లలో ప్రియాంక చోప్రా కూడా ఉంది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో నటిస్తున్న ఆమె, బే వాచ్ హాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే.