: నాసిరకం వస్తువులు వ‌ద్దు.. ప‌లు చైనా వ‌స్తువుల‌ను నిషేధించిన భార‌త్


భార‌త్ దిగుమ‌తి చేసుకుంటున్న ప‌లు చైనా వ‌స్తువుల‌పై నిషేధం విధిస్తున్న‌ట్లు కేంద్ర‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈరోజు లోక్‌స‌భ‌లో తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌ని, నాసిర‌కం నాణ్య‌తతో దిగుమ‌తి అవుతోన్న వ‌స్తువులను నిషేధిస్తున్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. నిషేధించిన వ‌స్తువుల్లో కొన్ని రకాల మొబైల్ ఫోన్స్‌, పాల ఉత్పత్తులతో పాటు ప‌లు వస్తువులు ఉన్నాయి. వీటి దిగుమ‌తిని నిషేధించ‌డంపై కార‌ణాలను వివ‌రిస్తూ.. మ‌నం దిగుమ‌తి చేసుకుంటున్న స‌ద‌రు ఉత్ప‌త్తుల నాణ్య‌త ఆమోద‌యోగ్యంగా లేద‌న్నారు. మ‌రికొన్ని వ‌స్తువులు నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని చెప్పారు. చైనా నుంచి దిగుమ‌తి చేసుకుంటోన్న ప‌లు మొబైల్స్‌కు ఐఎంఈఐ నంబరు ఉండట్లేదని తెలిపారు.

  • Loading...

More Telugu News