: నేటి బాలీవుడ్ స్టార్ నాడు అమితాబ్‌తో ఫోటో దిగాడు!


ఈ ఫోటోలో క‌నిపిస్తోన్న వారు ఎవ‌రెవరో చెప్ప‌గ‌ల‌రా..? అమితాబ్ పేర‌యితే వెంట‌నే చెప్పేస్తాం.. మ‌రి బిగ్ బీ ప‌క్క‌న కూర్చున్న బాలుడు ఎవ‌రు..? ‘బాలీవుడ్‌లోనే నిన్ను మించిన డాన్సు చేసే కథానాయకుడు లేడు’ అంటూ అభిమానుల‌తో నీరాజ‌నాలందుకుంటున్నాడు ఆ అబ్బాయి. వైవిధ్యమైన క‌థ‌ల‌ను ఎంపిక‌ చేసుకుంటూ, అద్భుత న‌ట‌న‌తో కోట్లాది మంది అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు ఈ ఫోటోలో బిగ్ బీతో ఉన్న అబ్బాయి. అంతేకాదు, ‘క్వీన్’ లాంటి ఓ న‌టితో బ్రేక‌ప్ అయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్ర‌తీరోజు వార్త‌ల్లో నిలుస్తోన్న నేటి బాలీవుడ్ స్టారే ఈ అబ్బాయి. అవును, ఈ ఫోటోలోని బాలుడు హృతిక్ రోష‌నే! చిన్నప్పటి నుంచీ అమితాబ్ బచ్చన్కు పెద్ద ఫ్యాన్ అయిన బాలీవుడ్ స్టార్‌ హృతిక్ రోష‌న్.. ఇప్పటికే బిగ్‌బీతో త‌న అనుబంధంపై ఎన్నోసార్లు అభిమానుల‌తో పంచుకున్నాడు. తాజాగా మ‌రోసారి అమితాబ్ బ‌చ్చ‌న్‌తో తాను చిన్న‌ప్పుడు దిగిన ఓ ఫోటోను హృతిక్ రోష‌న్ ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. తాను పోస్ట్ చేసిన ఫోటోలో 'అమితాబ్‌తో ఉన్న‌ బాలుడిని గుర్తు పట్టగలరా?' అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ, హృతిక్ ట్వీట్ చేశాడు. అంతేకాదు... ‘అప్పటి నుంచి ప్రతి నటుడిలో అమితాబ్‌ ఉన్నారు’ అంటూ కామెంట్ చేశాడు. ఆ విధంగా త‌న చిన్న‌నాటి నుంచే అమితాబ్ త‌న‌లో ఉన్నారంటూ ప‌రోక్షంగా చెప్పాడు. హృతిక్‌ చిన్న‌నాటి ఫోటోలో అమితాబ్ ఉండ‌డాన్ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

  • Loading...

More Telugu News