: ‘తృణమూల్’ కార్యకర్తపై చేయి చేసుకున్న రూపా గంగూలీ!... కేసు నమోదు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మహిళా నేత రూపా గంగూలీపై కేసు నమోదైంది. రాష్ట్రంలో నేటి ఉదయం ప్రారంభమైన నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా రూపా గంగూలీ పోటీ చేస్తున్న హౌరా నియోజకవర్గానికి కూడా పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఆమె ఓ పోలింగ్ బూత్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు, గంగూలీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సహనం కోల్పోయిన రూపా... తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఓ కార్యకర్తపై చేయి చేసుకోవడమే కాకుండా ఆ వ్యక్తిని తోసేశారు. దీంతో అక్కడ కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు... పోలింగ్ బూత్ వద్ద ఘర్ణణకు కారణమై, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ రూపాపై కేసు నమోదు చేశారు.