: బిగ్ ఫైట్ షురూ!... పార్లమెంటు సమావేశాలు ప్రారంభం


పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఉత్తరాఖండ్ లో రాజకీయ సంక్షోభం, జీఎస్టీ బిల్లు సహా మరిన్ని కీలక విషయాలపై నరేంద్ర మోదీ సర్కారుపై విరుచుకుపడేందుకు విపక్షాలన్నీ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి. అదే సమయంలో విపక్షాల వాదనను తిప్పకొట్టడమే కాకుండా, తామనుకున్న బిల్లులకు ఆమోదం పొందేందుకు మోదీ సర్కారు కూడా సర్వసన్నద్ధమైంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన సమావేశాల్లో... ఇటీవల చనిపోయిన పలువురు సభ్యులకు లోక్ సభ నివాళి అర్పించింది. మరోవైపు ఇటీవలే రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల చేత చైర్మన్ హమీద్ అన్సారీ ప్రమాణం చేయించారు.

  • Loading...

More Telugu News