: కన్నయ్య కుమార్ కు ఉద్ధవ్ థాకరే మద్దతు... బీజేపీ తప్పు చేస్తోందని విమర్శ!


దేశద్రోహం ఆరోపణలపై అరెస్టై కేసులను ఎదుర్కొంటున్న జవహర్ లాల్ నెహ్రూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ విషయంలో బీజేపీ తప్పు చేస్తోందని శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యానించారు. కన్నయ్యను జాతి విద్రోహిగా చిత్రీకరించాలని బీజేపీ భావించడం పెద్ద తప్పని ఆయన అన్నారు. శివసేన ఆఫీస్ బేరర్లతో సమావేశమైన ఆయన, కన్నయ్యను 'దేశద్రోహి' అనడం తగదని, భారత యువతకు సంబంధించిన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సలహా ఇచ్చారు. ఇండియాలో యువత సంఖ్య చాలా ఎక్కువని, వారిని తప్పుదారి పట్టించాలని చూడవద్దని హితవు పలికారు. రోహిత్ వేముల, హార్దిక్ పటేల్, కన్నయ్య కుమార్ ఉదంతాలను ప్రస్తావిస్తూ, బీజేపీ స్వీయ తప్పులతో యువతకు దూరమయ్యే పరిస్థితిని తెచ్చుకోరాదని హితవు పలికారు.

  • Loading...

More Telugu News