: ఇండియాలో ఉగ్ర నియామకాలు చేస్తున్న టాప్ ఐఎస్ఐఎస్ నేత హతం


భారత యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తూ, వారిని ఐఎస్ఐఎస్ లో చేరుస్తున్న సిరియా ఉగ్ర నేత మహమ్మద్ షఫీ అర్మార్ అలియాస్ యూసుఫ్ హతమైనట్టు తెలుస్తోంది. అమెరికా మానవరహిత విమానాలు సిరియాపై జరిపిన దాడుల్లో అర్మార్ మరణించినట్టు వార్తలు వచ్చాయి. షఫీ ఇండియాలో ఐఎస్ఐఎస్ రిక్రూట్ మెంట్లను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీకి అత్యంత దగ్గరి ఉగ్రవాదుల్లో షఫీ ఒకడు. ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో ఉగ్ర నియామకాలను చేపట్టినట్టు షఫీపై ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల షఫీ సిరియాకు వెళ్లి, ఉగ్రవాదుల్లో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఇతని సోదరుడు సుల్తాన్ అర్మార్ గత సంవత్సరం మార్చిలో యూఎస్ దాడుల్లోనే హతమయ్యాడు.

  • Loading...

More Telugu News