: వివాదాస్పద నటుడు ఉదయ్ కిరణ్ పై పీడీ చట్టం.. ఏడాది పాటు జైల్లోనే!


ఓ సినీ నటుడిపై తొలిసారిగా పీడీ చట్టం నమోదైంది. హైదరాబాద్, కాకినాడ పరిధుల్లోని పలు పోలీసు స్టేషన్లలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న హీరో నండూరి ఉదయ్ కిరణ్ పై జూబ్లీహిల్స్ పోలీసులు పీడీ యాక్టును నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న ఆయనపై పీడీ చట్టాన్ని నమోదు చేసినట్టు ఆయనకు నోటీసులు ఇచ్చారు. మూడు చిత్రాల్లో హీరోగా నటించిన ఉదయ్, గతంలో డ్రగ్స్ కేసుల్లో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈయనపై దాదాపు 10 కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల దస్ పల్లా హోటల్ లోని పబ్ లో సిబ్బందిని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. చంచల్ గూడా జైలుకు వెళ్లిన పోలీసు అధికారులు పీడీ యాక్ట్ నోటీసులపై ఉదయ్ సంతకాన్ని తీసుకున్నారు. ఈ చట్టం ప్రకారం కేసు నమోదైతే, కనీసం ఏడాది పాటు చార్జ్ షీట్ తో సంబంధం లేకుండా నిందితుడిని నిర్బంధంలో ఉంచవచ్చు. దీంతో ఉదయ్ ఇక ఓ సంవత్సరం పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. కాగా, ఉదయ్ కిరణ్ గతంలో 'ఫ్రెండ్స్ బుక్' చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News