: 30 శాతం హెచ్ఆర్ఏ, 5 డేస్ వర్కింగ్, 5 వేల ఇళ్లు: ఉద్యోగులకు చంద్రబాబు వరాలు


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయానికి నేటి తెల్లవారుజామున ప్రారంభోత్సవం జరిగిపోయింది. జూన్ ఆఖరు నాటికి అమరావతి నుంచే పాలనను సాగించనున్నట్లు ఈ సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. సదరు ప్రకటన ద్వారా... ఉద్యోగులు అమరావతికి తరలిరావాల్సిందేనని చంద్రబాబు పరోక్షంగా హెచ్చరించారు. పూర్తిగా సౌకర్యాలు లేని పరిస్థితుల్లో పనిచేయనున్న ఉద్యోగులకు ఈ సందర్భంగా చంద్రబాబు వరాలు ప్రకటించారు. అమరావతిలో పనిచేసే ఉద్యోగులకు హెచ్ఆర్ఏను 30 శాతానికి పెంచుతామన్న తమ హామీని నిలబెట్టుకుంటామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇక ముందుగా నిర్ణయించిన మేరకు అమరావతి నుంచి పనిచేసే ఉద్యోగులు వారానికి 5 రోజులు పనిచేస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు. రాజధాని నిర్మాణంలో భాగంగా తొలి దశలోనే ఉద్యోగుల కోసం 5 వేల ఇళ్లను నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు.

  • Loading...

More Telugu News