: చిత్ర నిర్మాణ రంగంలోకి ఎమ్మెల్యే బొండా... ఘనంగా కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు
చిత్ర నిర్మాణ రంగంలోకి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరావు అడుగుపెడుతున్నారు. హైదరాబాద్ లోని సాగర్ సొసైటీ ఆఫీసులో కొత్త చిత్రం పూజా కార్యక్రమాలు ఈరోజు జరిగాయి. ఏపీ ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అయిన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శిష్యుడు దారపనేని పద్మనాభరావు కథను అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ శిష్యుడు కేటీ కమలనాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అరుణ్ అదిత్, యామిని హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో కాకినాడలో జరగనున్నట్లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతాన్ని వినోద్ యాజమాణ్య అందించనున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, టీడీపీ ఎంపీ శివప్రసాద్ పాల్గొన్నారు.