: నేనేమీ అడగలేదు... వాళ్లే ఇస్తామంటున్నారు: టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ


మంత్రి వర్గ విస్తరణలో అవకాశమివ్వమని తానేమీ అడగలేదని, వారే ఇస్తామంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. టీడీపీలో చేరడానికి తానేమీ డబ్బులు తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకత్వం గురించి కూడా ఆయన మాట్లాడారు. 'నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే సంస్కారం కూడా లేని వ్యక్తి జగన్' అంటూ విమర్శించారు. జగన్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వాన్ని గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడిన వ్యక్తిని తానని జ్యోతుల నెహ్రూ అన్నారు.

  • Loading...

More Telugu News