: త్వరలో ఏపీకి కొత్త హైకోర్టు: సీఎం చంద్రబాబు
త్వరలో ఏపీకి కొత్త హైకోర్టు రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ సంస్కరణలపై ఢిల్లీలో ఈ రోజు జరిగిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. సదస్సు అనంతరం చంద్రబాబాబు విలేకరులతో మాట్లాడుతూ, కొత్త హైకోర్టును విభిన్నంగా నిర్మించేలా ఆలోచిస్తున్నామని చెప్పారు. 7,8 అంశాల ఆధారంగా ఒక్కో సమస్యపై యాక్షన్ ప్లాన్ ను రూపొందించారన్నారు. ప్రతి ఏటా 10 శాతం ఖాళీలను భర్తీ చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జ్యుడిషియల్ సిస్టం మొత్తం కంప్యూటరైజేషన్ పై చీఫ్ జస్టిస్ మాట్లాడారని, హైకోర్టులు, సీఎం ల మధ్య సమన్వయంపై చర్చ జరిగిందన్నారు. అంతేకాకుండా, కమర్షియల్ కోర్టుల ఏర్పాటు అంశంపై కూడా ఈ సదస్సులో చర్చించడం జరిగిందన్నారు.