: హైదరాబాద్ లో కల్తీ నెయ్యి దందా!
హైదరాబాద్ లోని ముసారాంబాగ్ లో కల్తీ నెయ్యిను పట్టుకున్నారు. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, మలక్ పేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఈ వ్యవహారం వెలుగుచూసింది. శాలివాహననగర్ లోని కల్తీ నెయ్యి అడ్డాలో తనిఖీలు నిర్వహించి 4 వేల కేజీల నూనెను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శివ, ఈశ్వరన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కల్తీరాయుళ్ల పై పీడీ యాక్టు కింద కేసులు నమోదు తప్పవని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మలక్ పేట కేంద్రంగా కల్తీ నెయ్యి తయారీ చేస్తున్నారని చెప్పారు. ఈ నకిలీ నెయ్యిని హోటళ్లకు, స్వీట్ షాపులకు, కిరాణా షాపులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే కల్తీ నెయ్యి తయారీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్ ఫోర్స్ అడిషినల్ డీజీపీ కోటిరెడ్డి తెలిపారు.