: శత్రుజీత్ లో అపశ్రుతి... ముగ్గురు జవాన్లు మృతి
శత్రువు ఒక్కసారిగా విరుచుకుపడితే, ఇండియా ఎలా స్పందించాలన్న విషయమై రాజస్థాన్ లోని థార్ ఎడారిలో జరుగుతున్న 'శత్రుజీత్' ఎక్సర్ సైజ్ లో అపశ్రుతి దొర్లింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు యుద్ధం చేస్తుండగా, ప్రమాదం జరిగి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. రెండు నెలల పాటు జరిగిన శత్రుజీత్ లో ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి చెందారని ఆర్మీ స్టాఫ్ జనరల్ దల్బీర్ సింగ్ ప్రకటించారు. మొత్తం మీద ఈ ప్రదర్శన సంతృప్తికరంగా సాగిందని ఆయన తెలిపారు. వివిధ రకాల ఫార్మేషన్స్ పరిశీలించి, పరీక్షించామని వివరించారు. 30 వేల మందికి పైగా సైన్యం పాల్గొన్న పరీక్షల్లో, వివిధ విభాగాల మధ్య సమన్వయం చక్కగా కుదిరిందని తెలిపారు. కాగా, శత్రుజీత్ విన్యాసాలు నేటితో ముగియనున్నాయి.