: ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సినీ తారల సందడి
హైదరాబాదు, ఖైరతాబాదులోని ఆర్టీఏ కార్యాలయంలో ఈ రోజు సినీ తారలు సందడి చేశారు. సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, అఖిల్ ఇద్దరూ ఖైరతాబాద్ లోని ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొన్న కార్ల రిజిస్ట్రేషన్ నిమిత్తం వారిద్దరూ ఆర్టీఏ కార్యాలయానికి రావడం విశేషం. ఈ మధ్యే ఎన్టీఆర్ కొన్న బీఎండబ్ల్యూ కారు కోసం టీఎస్ 09 ఈఎల్ 9999 నెంబర్ ను వేలంలో 10.5 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అఖిల్ కూడా కొత్త కారు రిజిస్ట్రేషన్ కు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వారిని చూసేందుకు వారి అభిమానులు ఎగబడ్డారు.