: పాలేరు ఉప ఎన్నికలో పోటీపై టీడీపీలో సందిగ్ధత
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో తెలుగు దేశం పార్టీ పోటీ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. పోటీపై తెలంగాణ నేతలే తేల్చుకోవాలని టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. అయితే దీనిపై నేతల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. పాలేరు నుంచి టీడీపీ పోటీ చేస్తుందా.. అనే అంశం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, గత సంప్రదాయాలు పాటిస్తామంటూ పోటీ నుంచి వైసీపీ ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే.