: యువతిని ఈడ్చుకెళ్లి, కిడ్నాప్ చేసి అత్యాచారం.. సీసీ కెమెరాల్లో బయటపడ్డ దారుణం
పంజాబులోని ముక్తకసర్‌లో ఓ దళిత యువతిని ఈడ్చుకెళ్లి, కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన దారుణం తాజాగా వెలుగులోకొచ్చింది. ముక్తకసర్‌లో ఓ ప్రైవేట్ కంప్యూటర్ సెంటర్‌లో పనిచేస్తోన్న యువతిని ఓ కామాంధుడు బలవంతంగా ఈడ్చుకెళ్లిన ఉదంతం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతంలో దళిత యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు ఈ ఘటనపై మొదట నిర్లక్ష్యం వహించారు. అయితే, బాధితురాలు జాతీయ ఎస్సీ కమిషన్ ను ఆశ్రయించడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సాక్ష్యాధారాలు ఉన్నా కేసు నమోదు చేయకపోవడంపై సమాధానం చెప్పాలని జాతీయ ఎస్సీ కమీషన్ నోటీసులు జారీ చేయడంతో పోలీసులు స్పందించినట్లు సమాచారం.