: ధోనీ సేనపై విరుచుకుపడుతున్న కోహ్లీ, డివిలియర్స్
టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య నేడు ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్ 9 లో భాగంగా పూణే వేదికగా రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించింది. ఆదిలోనే కేఎల్ రాహుల్ (7) వికెట్టును కోల్పోయినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ (46), స్టార్ బ్యాట్స్ మన్ డివిలియర్స్ (53) పూణే బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. డివిలియర్స్ ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా ఆడుతున్నాడు. దీంతో పూణే బౌలర్లు, ఫీల్డర్లు చేష్టలుడిగారు. దీంతో 13 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు ఒక వికెట్ కోల్పోయి 111 పరుగులు చేసింది.