: ఆశారాం, కుమారుడి నివాసాల్లో సోదాలు... 42 బ్యాగ్ ల నిండా కోట్లాది రూపాయలు
తమను తాము ఆధ్యాత్మికవేత్తలుగా ప్రకటించుకున్న ఆశారాం బాపు, ఆయన కుమారుడు నారాయణ్ సాయి నివాసాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 42 బ్యాగుల నిండా కోట్లాది రూపాయల డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణ్ సాయిపై రూ.750 కోట్ల జరిమానాను ఆదాయపు పన్ను శాఖ అధికారులు విధించారు. ఈ విషయమై ఆశారాం తరపు అడ్వకేట్ కల్పేశ్ దేశాయ్ మాట్లాడుతూ, నారాయణ్ సాయిపై జరిమానా విధించిన మాట వాస్తవమేనని చెప్పారు.