: పాలేరు ఎన్నికల బరినుంచి తప్పుకున్న వైసీపీ.. ఉమ్మడి అభ్యర్థికి మద్దతు
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికల పోటీలో ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ తెలంగాణ నేతలు వైఎస్సార్ పార్టీ అధినేత జగన్‌తో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పాలేరు ఎన్నికల బరినుంచి వైసీపీ తప్పుకుంది. కాంగ్రెస్ ప్రతిపాదించిన ఉమ్మడి అభ్యర్థికి వైసీపీ మద్దతు తెలిపింది. గత సాంప్రదాయాల్ని పాటిస్తామని వైసీపీ పేర్కొంది. అహంకారంతోనే పాలేరు ఉపఎన్నికల్లో తెరాస పోటీకి దిగుతోందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.