: ‘ఉస్మానియా’ తరహాలో మరో మూడు కొత్త ఆస్పత్రులు నిర్మిస్తాం: కేసీఆర్


గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల తరహాలో హైదరాబాద్ నగరంలో మరో మూడు పెద్ద ఆసుపత్రులను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆసుపత్రుల నిర్మాణంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన ఆసుపత్రుల నిర్మాణం రెండేళ్లలో పూర్తికావాలని, ఆసుపత్రుల నమూనా రూపొందించి, వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. యాస్కోప్ సహకారంతో ఆసుపత్రుల నమూనాలు రూపొందించాలని సూచించారు. హైదరాబాద్ సహా కరీంనగర్, ఖమ్మంలో ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. హైదరాబాద్ లో మొదటిదశలో మూడు పెద్దాసుపత్రులు నిర్మించాలని, ఒక్కో ఆసుపత్రిలో 750 పడకలు ఏర్పాటు చేయాలని, 1000 పడకల సామర్థ్యంతో ఉస్మానియా ఆసుపత్రి టవర్లు, కరీంనగర్, ఖమ్మంలో 500 పడకలతో ఆసుపత్రులు నిర్మించనున్నామని కేసీఆర్ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ను నెదర్లాండ్స్ కు చెందిన రోబో బ్యాంక్ ప్రతినిధులు కలిశారు. ఆసుపత్రుల నిర్మాణంలో పాలుపంచుకుంటామని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. శ్రీలంకతో పాటు పలు ప్రాంతాల్లో పెద్దాసుపత్రులు నిర్మించిన అనుభవం రోబో బ్యాంక్ కి ఉంది.

  • Loading...

More Telugu News