: ఆ కుక్కల పోరాటం ఇంటర్నెట్ ను కుదిపేస్తోంది


సాధారణంగా కుక్కలు ఒంటరిగా, ఎదురు బొదురుగా పోరాటానికి దిగితే... ఆ ఫైట్ ఒకట్రెండు నిమిషాల్లో ముగుస్తుంది. గుంపుగా కుక్కలన్నీ కలిసి ఒక కుక్కపై పడితే ఆ పోరాటం ఒక నిమిషం లోపే ముగిసిపోతుంది. అదే పోరాటం పదుల సంఖ్యలో మనుషులు అడ్డుకుంటున్నా ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు సాగితే...అది చిత్రమే. ఇలాంటి చిత్రమే పెరూలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...చింబోటే నగరంలోని ఓ రద్దీ వీధిలో ఓ పెద్ద కుక్క చిన్నకుక్కపైకి ఎగబడింది. తన పదునైన దంతాలతో దాని మెడను దొరకబుచ్చుకుంది. దీనిని గమనించిన ఓ మహిళ వాటిని దూరంగా తరమే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నానికి కుక్క అంగుళం కూడా కదల్లేదు. దీంతో ఆమె తన హ్యాండ్ బేగ్ తో పెద్ద కుక్కును కొట్టింది. అయినా, తనకు తగలనట్టే ఆ కుక్క చిన్నకుక్కను నోటకరుచుకుంది. దీంతో ఆమె స్నేహితుడు దానిని తన బూటు కాలితో తన్నాడు. అప్పటికీ ఆ కుక్క పట్టించుకోలేదు. ఈ తతంగం చూసిన ఓ పెద్ద మనిషి ఓ కర్రతీసుకొచ్చి కొట్టాడు. దానికి కూడా ఆ కుక్క బెదరలేదు. అంతలో అటుగా వచ్చిన పోలీస్, తన లాఠీతో ఇష్టానుసారం దానిని బాదాడు. అయినా అది వదల్లేదు. దీంతో ఓ యువకుడు ఈ పెద్ద కుక్క కాళ్లను పట్టుకుని వెనక్కు లాగాడు. అయినా అది పట్టించుకోలేదు. దీంతో అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కారులోంచి దిగిన ఓ యువకుడు కుక్కపై పెప్పర్ స్ప్రేను స్ప్రే చేశాడు. దానిని కూడా ఈ పెద్దకుక్క పట్టించుకోలేదు. మనుషులు మాత్రం పరుగులు పెట్టారు. దీంతో ఆ చుట్టుపక్కల వెళ్తున్నవారంతా వాటిని విడిపించాలని కంకణం కట్టుకుని, పెద్ద కుక్కనోట్లో కర్రను పెట్టి బయటకు లాగారు. దాంతో చిన్న కుక్కను వదిలినట్టే వదిలిన పెద్దకుక్క మళ్లీ దానిని నోట కరుచుకుంది. ఇలా లాభం లేదని అక్కడ పదుల సంఖ్యలో గుమిగూడని ప్రజలు రెండు కుక్కలను పట్టుకుని కొట్టుకుంటూ అతి కష్టం మీద విడిపించేలా చేసి, చిన్న కుక్కను దూరంగా తీసుకెళ్లారు. అప్పటికి వాటి పోరాటం ముగిసింది. ఈ తతంగమంతా ఓ వ్యక్తి వీడియో తీసి, దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News