: నేనెవరినీ అసభ్యంగా తాకలేదు... బస్సులోకి దారి చూపానంతే: మధ్యప్రదేశ్ హోంమంత్రి
బీజేపీ మహిళా కార్యకర్తలను మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ ఉద్దేశపూర్వకంగా అసభ్యకరంగా తాకినట్టు వచ్చిన వీడియో క్లిప్పింగులపై ఆయన స్పందించారు. తాను కేవలం మహిళలను త్వరగా బస్సెక్కాలని మాత్రమే సూచించానని చెప్పారు. ఎవరినీ అసభ్యంగా తాకలేదని స్పష్టం చేశారు. కార్యకర్తలు అధికంగా ఉండటంతో, బస్సెక్కకుండా కిందే నిలిస్తే, వారికి ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతోనే వారిని త్వరగా బస్సులోకి వెళ్లాలని చెప్పానని ఆయన అన్నారు. ఈ క్లిప్పింగ్స్ లో చూపుతున్నదంతా అవాస్తవమని, తాను చెప్పేదే నిజమని కూడా తెలిపారు. కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవగా, దేశంలోని అన్ని టెలివిజన్ చానళ్లూ ఈ దృశ్యాలను ప్రముఖంగా చూపాయి. ఈ వీడియోల్లో ఓ మహిళ నడుము కిందిభాగంపై బాబూలాల్ చేతులు వేసి నెడుతున్నట్టు కనిపించిన సంగతి తెలిసిందే.