: టీఆర్ఎస్ ప్లీనరీకి ఈసీ అనుమతి.. షరతులు మాత్రం వర్తిస్తాయి!
ఖమ్మంలో తెలంగాణ రాష్ట్ర సమితి తలపెట్టిన ప్లీనరీకి ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ప్లీనరీని జరుపుకోవచ్చని చెప్పిన ఈసీ, కొన్ని షరతులు విధించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా, మంత్రులెవరూ అధికారిక పర్యటనలు చేయరాదని హెచ్చరించింది. ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రసంగాలు, ప్రకటనలు చేయరాదని స్పష్టం చేసింది. ప్లీనరీ ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నుంచి సహాయం తీసుకోకూడదని వెల్లడించింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా, పాలేరు ఉపఎన్నికల నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతున్న సంగతి తెలిసిందే.