: నా విదేశీ ఆస్తి ఇంతే: మాల్యా
తనకు విదేశాల్లో ఉన్న ఆస్తుల గురించిన వివరాలను యూబీ గ్రూప్ మాజీ అధినేత విజయ్ మాల్యా కోర్టుకు వెల్లడించారు. తనకు, విదేశాల్లో రూ. 780 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వివరించారు. ఓ కంపెనీగా కింగ్ ఫిషర్ సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు, తన వ్యక్తిగత విదేశీ ఆస్తులకు ముడిపెట్టరాదని చెబుతూ, ఓ అఫిడవిట్ ను దాఖలు చేశారు. కాగా, ఓ వ్యాపారవేత్తగా, కింగ్ ఫిషర్ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల నిమిత్తం ఆయన తీసుకున్న రుణాల మొత్తం వడ్డీతో కలిపి రూ. 9 వేల కోట్లు దాటిన సంగతి తెలిసిందే. పెరిగిన విమాన ఇంధన ఖర్చులతో బాటు, బ్యాంకులు ఈక్విటీలను, సంస్థ ఖాతాలను స్తంభింపజేయడంతోనే సమస్య పెద్దదైందని ఈ అఫిడవిట్ లో మాల్యా ఆరోపించినట్టు సమాచారం.