: విమానంలో ఎయిర్‌హోస్టెస్ ను ఫోటోలు, వీడియో తీశాడు.. బుక్కయ్యాడు
ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఎయిర్ హోస్టెస్ ను ఫోటోలు తీసి, వీడియో చిత్రీకరించిన ఓ బంగ్లాదేశీయుడిని ముంబై ఎయిర్‌పోర్ట్ భద్రతా సిబ్బంది అరెస్టు చేశారు. కోల్ కతా నుంచి ముంబై బయలుదేరిన ఇండిగో ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సర్వీస్ అందిస్తోన్న సమయంలో ఓ ఎయిర్‌హోస్టెస్‌ను విమానంలో ఉన్న ఓ వ్యక్తి తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి సెల్‌ఫోన్ సాయంతో వీడియో తీస్తుండగా గమనించిన ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం బయటపడింది. ఎయిర్ హోస్టెస్ వీడియో చిత్రీకరణకు పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. నిందితుడికి సాయం చేసిన అతడి ఇద్దరు స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.