: ఈ సినిమా మొదటి ఆట చూస్తా... చిరంజీవితో కలసి వస్తా... అవకాశం కల్పించండి: కేసీఆర్
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని తాను తన ఫ్యామిలీతో కలసి మొదటి ఆట చూస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అందుకు అవకాశం కల్పించాలని బాలకృష్ణను కోరిన ఆయన, "చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి, నేను ఫ్యామిలీతో వచ్చి చూస్తాను. చిరంజీవి.. మేమంతా కలిసే చూడాలని..." అనగానే చిరంజీవి కల్పించుకుని "ఫస్ట్ ఆడియన్స్ మీరే" అన్నారు. ఫస్ట్ ఆడియన్సా... అని అడిగిన కేసీఆర్, "స్టేజ్ మీదున్న బ్యాచే ఫస్ట్ ఆడియన్స్ కావాలని చెప్పి... అందుకు బాలకృష్ణ, దర్శకుడు అవకాశం కల్పించాలని కోరుతూ... సంతోషం, థ్యాంక్యూ" అంటూ తన ప్రసంగాన్ని ముగించి, బాలకృష్ణను కేసీఆర్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.