: స్పీకర్ ‘రాసలీల’ గన్ మన్ పై కేసు నమోదు... ఐపీసీ సెక్షన్లు 448, 497 కింద అభియోగాలు


తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి గన్ మన్ గా వ్యవహరిస్తూ మహిళతో రాసలీలల్లో మునిగి వివాదంలో చిక్కుకున్న వెంకటేశ్వర్లు అనే పోలీసుపై ఎట్టకేలకు కేసు నమోదైంది. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఈ కేసులో... ఐపీసీ సెక్షన్లు 448 (అక్రమ ప్రవేశం), 497 (వ్యభిచారం) కింద అభియోగాలు నమోదయ్యాయి. తన సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన స్పీకర్ వెంట ఆయన భద్రత కోసమంటూ వెళ్లిన వెంకటేశ్వర్లు డ్యూటీని పక్కనపెట్టేసి ఓ మహిళ ఇంటిలోకి దూరి ఆమెతో రాసలీలల్లో మునిగిపోయి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహిళ భర్త, ఆమె బంధువులు మెరుపు దాడి చేయడంతో వెంకటేశ్వర్లు ఒంటిపై నూలు పోగు లేకుండా వీధుల్లో పరుగులు పెట్టాడు. దీనిపై సమాచారం అందుకున్న స్పీకర్ చట్టప్రకారం వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లుపై కేసు నమోదు చేసినట్లు భూపాలపల్లి సీఐ తెలిపారు. ఇక వెంకటేశ్వర్లు రాసలీలు జరిపిన మహిళ టీఆర్ఎస్ కార్యకర్త అని, భూపాలపల్లికి వచ్చిన సందర్భంగా స్పీకర్ ను కలిసేందుకు వచ్చే కార్యకర్తలతో పాటు ఆమె కూడా వచ్చేదని సమాచారం. ఈ క్రమంలోనే స్పీకర్ వద్దకు కార్యకర్తలను పంపే బాధ్యతల్లో ఉండే వెంకటేశ్వర్లు ఆమెతో పరిచయం పెంచుకుని ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News