: 27 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్ గఢ్ లోని నారాయణ పూర్ లో అధిక సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. 27 మంది నక్సలైట్లు లొంగిపోయారని, అందులో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారని ఐటీబీపీ అధికారులు పేర్కొన్నారు. ఐటీబీపీకి చెందిన 45, 46వ బెటాలియన్ పోలీసుల ఎదుట వారు లొంగిపోయారన్నారు. కాగా, దంతేవాడ జిల్లాలో సీఆర్ఫీఎఫ్ చేపట్టిన కూంబింగ్ లో ఏడుగురు మావోయిస్టులు ఉన్నారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.