: బోయపాటి గత సినిమాలు వేరు...సరైనోడు వేరు: రకుల్


బోయపాటి శ్రీను గత సినిమాలు వేరు, 'సరైనోడు' సినిమా వేరని అందాల నాయిక రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. ఈ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, 'సరైనోడు' ఓ ఎమోషన్ చుట్టూ తిరుగుతుందని చెప్పింది. యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్, మెలొడ్రామా అన్నీ కలగలసిన సినిమా 'సరైనోడు' అని తెలిపింది. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని చెప్పింది. ఈ సినిమాలో విలన్ పాత్రలో నటుడు 'అది' అద్భుతంగా నటించాడని, చాలా స్టైల్ గా భలే ఉన్నాడని రకుల్ కితాబునిచ్చింది. బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ బాగా నటించారని తెలిపింది. కేథరీన్ తో తనకు కేవలం రెండు రోజుల పరిచయమే అయినా, ఆమె బాగా దగ్గరైందని, బాగా నటించిందని చెప్పింది. తన పాత్ర సంప్రదాయ బద్ధంగా సాగుతుందని తెలిపింది. ఈ సినిమాను థియేటర్ లో చూడాలనుందని యూనిట్ కు చెప్పానని, మరి వారు ఏ థియేటర్ లో చూపిస్తారో చూడాలని పేర్కొంది. పవన్ కల్యాణ్ తో అవకాశం వస్తే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని రకుల్ సంసిద్దత వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News