: అగ్రి వర్సిటీలో ఉద్రిక్త ప‌రిస్థితులు.. విద్యార్థులపై లాఠీచార్జ్, అరెస్ట్


న్యూట్రిషన్ సైన్స్ కోర్సును తొలగిస్తూ అధికారులు తీసుకున్న నిర్ణ‌యాన్ని నిర‌సిస్తూ హైదరాబాదు, రాజేంద్ర నగర్ లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేస్తోన్న‌ విద్యార్థుల ఆందోళ‌న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు దారి తీసింది. ఆందోళ‌నకు దిగిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలో ఆందోళ‌న చేస్తున్న విద్యార్థుల‌పై లాఠీచార్జి చేసిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దేందుకు భారీగా పోలీసు బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకున్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News