: ఏడుస్తున్న బుడ్డోడిలా కనిపిస్తున్న ఐపీఎల్: ప్రీతీ జింతా


ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి సీజన్ లోనూ, తన ఫ్రాంచైజీతో కలిసి నడుస్తూ, పోటీలు జరిగే చోట గ్లామర్ వాతావరణాన్ని మరింతగా పెంచుతున్న సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింతా పోటీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో కరవు, పోటీల తరలింపు, బ్రాండ్ విలువ తగ్గడం, స్టేడియాలు నిండక పోవడం తదితరాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఐపీఎల్ ఏడుస్తున్న బుడ్డోడిలా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ప్రీతీ జింతా, పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ, "జరుగుతున్న పరిణామాలు ఐపీఎల్ ఫ్రాంచైజీ యాజమాన్యాలకు నష్టం కలిగించేవే. ప్రతి సంవత్సరమూ ఏదో ఒక వివాదం, రూమర్స్ వచ్చి మాకు నష్టం వాటిల్లుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఐపీఎల్ ప్రజాదరణను కోల్పోతుందేమో" అని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News