: ఆస్తుల వేలానికి అనుమతించకుండా అగ్రిగోల్డ్ పై ప్రేమ చూపుతారా? ఏపీ సర్కారుకు హైకోర్టు అక్షింతలు


ప్రజల నుంచి కోట్లాది రూపాయల డిపాజిట్లు స్వీకరించి, వాటిని తిరిగి చెల్లించడంలో ఘోరంగా విఫలమైన అగ్రిగోల్డ్ సంస్థపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెతకవైఖరితో ఎందుకు ఉంటోందని తెలుగురాష్ట్రాల హైకోర్టు ప్రశ్నించింది. అమరావతి పరిధిలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై ఏపీ సర్కారు అనుమతులను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. ప్రజలకు న్యాయం చేయాల్సిన విషయంలో తాత్సారం చేస్తున్నారని మండిపడింది. ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని అభిప్రాయపడింది. సమాధానం చెప్పేందుకు సీఆర్డీయే అధికారులు కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో భాగంగా తొలి దశలో రూ. 60 కోట్లు వచ్చాయని, రెండో దశలో రూ. 150 కోట్ల విలువైన ఆస్తులు వేలానికి రానున్నాయని, మూడో దశలో రూ. 180 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయాల్సి వుందని, వేలం ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్న హైకోర్టు తెలిపింది. కేసు తదుపరి విచారణను 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

  • Loading...

More Telugu News