: వారు వాంటెడ్ క్రిమినల్స్... ఫోటోలు గోడలకు అంటించండి: ఆగ్రహంతో హైకోర్టు
అక్షయ గోల్డ్ నిందితుల ఫోటోలను గోడలకు అంటించి వారి నిర్వాకంపై ప్రచారం చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. వారిని వెంటనే వాంటెడ్ క్రిమినల్స్ గా ప్రకటించాలని ఆదేశించింది. ఈ కేసులో నిందితుల పట్ల పోలీసులు కావాలనే తాత్సారం ప్రకటిస్తున్నట్టు కనిపిస్తోందని అభిప్రాయపడింది. ఈ ఉదయం తెలుగు రాష్ట్రాల హైకోర్టులో అక్షయ గోల్డ్ కేసు విచారణకు రాగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులను ఇప్పటివరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించిన న్యాయస్థానం, వారిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను 26కు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.