: ట్యూష‌న్స్ చెప్పి ఈ బైక్ కొనుక్కున్నా: ట్విట్ట‌ర్‌లో బాలీవుడ్ స్టార్


ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి ట్యూష‌న్స్ చెప్పి అలా సంపాదించిన డ‌బ్బుతో బైక్ కొనుగోలు చేశాన‌ని బాలీవుడ్ యంగ్ స్టార్ సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. కాలేజీ రోజుల్లో సొంత డ‌బ్బుతో అలా కొన్న బైక్‌పై కూర్చుని ఉండ‌గా తాను దిగిన ఓ ఫోటోను సుషాంత్ సింగ్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. 'క‌ళ్ల‌ద్దాల‌తో ఫోటోలో చాలా సీరియ‌స్‌గా క‌న్పిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న‌ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ధోనీ-ది అన్‌టోల్డ్‌ స్టోరీ’లో న‌టిస్తున్నాడు.

  • Loading...

More Telugu News