: ఒంటిమిట్ట రథోత్సవంలో వైఎస్ జగన్!... పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత జిల్లా కడప పర్యటనకు వెళ్లారు. జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో జరుగుతున్న రాములోరి కల్యాణ ఉత్సవాల్లో పాలుపంచుకునేందుకే ఆయన కడపకు వెళ్లారు. నేటి ఉదయం ఆలయానికి వెళ్లిన జగన్ అక్కడ జరుగుతున్న రాములోరి కల్యాణం రథోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన జగన్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.