: సాగునీటి పారుదల రంగంలో పెట్టుబడుల్లో దేశంలోనే తెలంగాణ నం.1, ఏపీ నం.2
సాగునీటి పారుదల రంగంలో దేశంలో వచ్చిన నూతన ప్రాజెక్టులు- పెట్టుబడులపై అసోచామ్ జరిపిన అధ్యయనంలో తెలంగాణ నం.1గా నిలిస్తే, ఏపీ నం.2గా నిలిచింది. గత పదేళ్లకాలం నుంచి ఈ రంగంలో వస్తోన్న పెట్టుబడులపై వెల్లడించిన నివేదికలో అసోచామ్ ఈ విషయాన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా సాగునీటి పారుదల రంగంలో వచ్చిన పెట్టుబడుల్లో 12 శాతం వాటాతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, 11శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. అయితే దేశంలో ఈ ప్రాజెక్టులు 84 శాతం నిర్మాణ దశలోనే ఉన్నాయని, 113 ప్రాజెక్టుల్లో మాత్రమే పనులు కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం మహారాష్ట్రలో 21శాతం, కర్ణాటకలో 18శాతం, ఏపీలో14 శాతం, గుజరాత్‌లో 12 శాతం, తెలంగాణలో 9 శాతం పెరిగినట్లు తెలిపింది. ‘ఇరిగేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ’లను ఏర్పాటు చేస్తే వ్యయభారం పెరగకుండా చూసుకోవచ్చని సూచించింది.