: ప్రేమ వివాహం చేసుకున్న ఇందిరాగాంధీ ఏమీ మతం మారలేదే!: శంకరాచార్య స్వరూపానంద సరస్వతి


పార్సీ మతస్తుడిని ప్రేమ వివాహం చేసుకున్న మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ మతమేమీ మారలేదంటూ ద్వారకా శారదా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యానించారు. పాశ్చాత్య సంస్కృతిని ఆమె అలవరచుకోలేదని, భారతీయ దేవతా మూర్తులను పూజించారంటూ ఇందిగాంధీపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ‘అమర్ ఉజాల’ అనే పత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. దేశం కోసం పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కుటుంబం తమ జీవితాలను త్యాగం చేసిందన్నారు. కాగా, ఇటీవల ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర లో నీటి కరవుకు కారణం షిర్డి సాయిబాబాను పూజించడమేనని, శనిసింగనాపూర్ గర్భగుడిలోకి మహిళలు వెళితే దుష్ఫలితాలు వస్తాయని, మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతాయంటూ స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News