: హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ లో ఆత్మహత్యకు పాల్పడ్డ సాఫ్ట్ వేర్ ఇంజనీర్
హైదరాబాదులోని ఎస్ఆర్ నగర్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్యహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. విద్యాధికుడు కావడంతో లక్కీ గుప్తా నొప్పి తెలియకుండా సూసైడ్ చేసుకోవడం ఎలా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేశాడు. నైట్రోజన్ గ్యాస్, మరో కెమికల్ తో నొప్పి తెలియకుండా ఆత్మహత్య చేసుకోవచ్చని గుర్తించాడు. దీంతో బాలానగర్ లో 5 వేల రూపాయలు వెచ్చించి, నైట్రోజన్ గ్యాస్ ను కొనుగోలు చేశాడు. అనంతరం రూంకు తిరిగి వచ్చి, నైట్రోజన్ గ్యాస్ లీక్ చేసి సూసైడ్ కు పాల్పడ్డాడు. ఆర్థిక సమస్యల వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆయన లేఖలో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.