: భారత్ కు పెరిగిన విదేశీ పర్యాటకులు
భారత దేశానికి విదేశీ పర్యాటకులు పెరుగుతున్నారని కేంద్ర పర్యాటక శాఖ తెలిపింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 25.08 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్ కు వచ్చారని పర్యాటక శాఖ ప్రకటించింది. విదేశీ పర్యాటకుల వల్ల భారత్ కు 5.986 బిలియన్ డాలర్ల విదేశీ మారకం సమకూరిందని ఆ శాఖ తెలిపింది. గత ఏడాది 22.81 లక్షల మంది విదేశీయులు భారత్ లో పర్యటించగా, ఈ ఏడాది వారి సంఖ్య పెరిగిందని పర్యాటక శాఖ తెలిపింది. యూరోప్ దేశాలు ఉగ్రదాడులతో దద్దరిల్లుతున్న వేళ, పర్యాటకులు వివిధ దేశాలను వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కు విదేశీ పర్యాటకులు పెరిగే అవకాశం కనిపిస్తోందని సమాచారం.