: పోలీసు గుర్రం ‘శక్తిమాన్’ మృతి


డెహ్రాడూన్ లోని పోలీసు గుర్రం శక్తిమాన్ ఈరోజు మృతి చెందింది. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే దాడిలో కాలు పోగొట్టుకున్న శక్తిమాన్ కు కృత్రిమ కాలుని అమర్చారు. నెలరోజుల నుంచి ‘శక్తిమాన్’ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కాగా, ‘శక్తిమాన్’ కాలు పోగొట్టుకున్న విషయం తెలుసుకున్న ఒక అమెరికన్ తన సొంత ఖర్చుతో దానికి కృత్రిమ కాలు తయారు చేయించాడు. వైద్యులు కొద్దిరోజుల క్రితమే ఆ కాలుని ‘శక్తిమాన్’కు అమర్చారు. దీంతో అది కోలుకుని తిరిగి నడుస్తుందని అందరూ భావించారు. అయితే, కోలుకోలేక ప్రాణాలు విడిచింది.

  • Loading...

More Telugu News