: ఇప్పట్లో పెళ్లి చేసుకోవట్లేదు: మిల్కీ బ్యూటీ తమన్నా
ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని దక్షిణాది అందాల నటి తమన్నా స్పష్టం చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తెలిపింది. ఆ వార్తలను తాను ఖండించినప్పటికీ మళ్లీ అవే కథనాలు వస్తున్నాయని మిల్కీ బ్యూటీ చెప్పింది. ప్రస్తుతం తాను ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం షూటింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. తన పెళ్లి వార్త ఏదైనా ఉంటే ముందుగానే అందరికీ చెబుతానని తమన్నా చెప్పింది.