: టీడీపీ సంప్రదించింది...నేను ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదు: రాజన్నదొర
పార్టీ మారాలంటూ టీడీపీ నేతలు తనను సంప్రదించారని సాలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత రాజన్నదొర తెలిపారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, బొబ్బిలి రాజులు టీడీపీలో చేరడంతో తాను కూడా పార్టీ మారుతున్నానని అంతా భావిస్తున్నారని అన్నారు. ఇలా భావించడం తప్పుకాదని ఆయన చెప్పారు. అయితే తాను పార్టీ మారడం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదని ఆయన తెలిపారు. తనకు విశ్వసనీయత ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటే అది చేస్తానని, పార్టీ మారడాన్ని తమ ప్రజలు హర్షించరని భావిస్తున్నానని ఆయన అన్నారు.