: వెస్ట్రన్ కల్చర్ లా జీన్స్, చెవిపోగులు వద్దు : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్


ఉత్తర కొరియాలో పాశ్చాత్య ఫ్యాషన్లపై వ్యామోహం పెంచుకోకుండా ఉండేందుకుగాను ఆ దేశంలో పలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పాశ్చాత్యదేశాల వారి మాదిరిగా హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయడం, జీన్స్, టీ-షర్ట్స్, మినీ స్కర్ట్స్, చెవిపోగులు ధరించడం వంటి వాటిని ఉత్తర కొరియా పౌరులు అనుసరించకూడదని తాజాగా ఆంక్షలు విధించారు. ఈ నిబంధనలను కిమ్ జాంగ్ ఉన్ విధేయులైన యువ సంఘాలు అమలు చేయనున్నాయి. ముఖ్యంగా చైనా దేశానికి సమీపంలో ఉన్న నార్త్ హంగ్వాంగ్, యాంగాంగ్ ప్రావిన్స్ ల్లో ఈ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా, ఉత్తరకొరియాలోని పురుషులు తన హెయిర్ స్టైల్ తరహాలోను, మహిళలు తన భార్య రిసోల్ బాబ్ హెయిర్ స్టైల్ ను అనుసరించాలంటూ కిమ్ జాంగ్ గతంలో ఆంక్షలు విధించినట్లు కథనాలు వెలువడ్డాయి. వెస్ట్రన్ కల్చర్, హెయిర్ స్టైల్ విషయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కనుక వారిని పెట్టుబడిదారుల అనుకూలురుగా భావిస్తామని, వారిపై నిఘా పెడతామని కిమ్ జాంగ్ సర్కార్ హెచ్చరించిన విషయం తెలిసిందే. జీన్స్, టీషర్ట్స్, మినీ స్కర్ట్, హెయిల్ స్టైల్ వంటివన్నీ పెట్టుబడిదారుల లక్షణాలని కిమ్ అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News