: అమ్మాయిలూ.. స్కర్టులతో డిస్కోలకు వెళ్లొద్దు: చండీగఢ్ పోలీసులు


మహిళా వేధింపులు, అమ్మాయిలపై అత్యాచారాల కేసుల సంఖ్యను తగ్గించుకునేందుకు చండీగఢ్ పోలీసులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. పబ్బులకు, డిస్కోలకు అమ్మాయిలు స్కర్టులతో వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. తమ సూచనను గుర్తించి అమ్మాయిలు స్కర్టులు వేసుకోవడం మానివేయాలని సూచించారు. పబ్ లు, డిస్కోలు, స్టార్ హోటళ్లపై నియంత్రణ చర్యల పేరిట మార్గదర్శకాలు విడుదల చేశారు. అందులో ఈ కొత్త నిబంధనను పొందుపరిచారు. స్కర్టులు వేసుకుని వచ్చే అమ్మాయిలను పబ్బుల్లోకి, డిస్కోల్లోకి అనుమతిస్తే కనుక వాటి అనుమతులు రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. కాగా, ఈ కొత్త నిబంధనపై బార్ల యాజమాన్యం, మహిళలు మండిపడుతున్నారు. తమ స్వేచ్ఛకు భంగం కల్గిస్తున్నారని మహిళలు అంటున్నారు.

  • Loading...

More Telugu News