: ఎల్ఐసీ అసిస్టెంట్ మేనేజర్ ను కత్తితో పొడిచి చంపిన కానిస్టేబుల్
ఎల్ఐసీ అసిస్టెంట్ మేనేజర్ ను హెడ్ కానిస్టేబుల్ కత్తితో పొడిచి చంపిన దారుణ సంఘటన ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. చీరాలోని ఎల్ఐసీ కార్యాలయంలో సునీల్ అనే వ్యక్తి అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. అదే కార్యాలయంలో కారంచేడుకు చెందిన హెడ్ కానిస్టేబుల్ భార్య అటెండర్ గా పని చేస్తోంది. ఈరోజు గుంటూరు వెళ్లేందుకని చీరాల బస్టాండ్ కు వచ్చిన సునీల్ పై హెడ్ కానిస్టేబుల్ కత్తితో దాడి చేశాడు. వెంటనే సునీల్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.