: అతను ప్రయోగం అంటాడు...సమాజం అతన్ని చెడిపోయాడంటోంది...ఏది నిజం?
రష్యాలోని సంపన్న వర్గానికి చెందిన ఫిల్మ్ మేకర్ గ్రెగోరీ మామురిన్ అనే యువకుడు తాను రష్యా స్పీల్ బర్గ్ నని చెప్పుకుంటాడు. కమ్యూనిజం పతనమైన తరువాత రష్యాలో విలువలు ఎలా మంటగలిశాయో చెప్పడమే తన ఉద్దేశ్యం అని చెప్పే గ్రెగోరి వీడియోలను అంతా ఎగబడి చూస్తారు. సామాజిక ప్రయోగం పేరుతో అతను తీసే వీడియోలు ఎలా ఉంటాయంటే...నడి బజార్లో మహిళలను ఆపి లోదుస్తులు విప్పేయాలని చెబుతాడు. అందుకు కొంత డబ్బు ఇస్తానని చెబుతాడు. ముందు అతనిని తిట్టిన మహిళలు అతను డబ్బును ఎక్కువిస్తానని చెప్పడంతో సరేనని, అంగీకరిస్తారు. ఇలా చేసేందుకు ఐదే వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు గ్రెగోరీ ఖర్చు చేశాడు. నడి రోడ్డు మీద గుండు గీయించుకుంటే డబ్బులిస్తానని చెబుతాడు. ముందు నిరాకరించినా, అతను బహుమతి మొత్తం పెంచుకుంటూ పోవడంతో మహిళలు అంగీకరించారు. అలాగే ప్రేమజంటలు, కొత్తగా పెళ్లయిన దంపతులకు కూడా డబ్బాశ చూపి, ఆ జంటల్లో మహిళలను లోబర్చుకున్నాడు. ఓ వ్యక్తితో డబ్బు ఆశ చూపి మూత్రం తాగించాడు. అలాగే రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి, తాను పెంచుకుంటున్న కుక్కపిల్ల వేరే కుక్కతో వెళ్లిపోయింది. అది తనను మోసం చేసిందని, దానిపై కసి తీర్చుకోవాలనుందని చెబుతూ, తాను పెంచాను కనుక దానిని చంపలేకపోతున్నాను...మీరు చంపితే డబ్బిస్తాను. అని తుపాకీ చేతిలో పెడితే...దానిని ఆ వ్యక్తి తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో అతనిని రష్యన్లు అంతా స్పాయిల్డ్ కిడ్ (చెడిపోయిన బాలుడు) అని పిలుస్తున్నారు. గ్రెగొరీ మాత్రం తాను సమాజంలో పతనమైన విలువలను చూపిస్తున్నానని చెబుతాడు. డబ్బు కోసం యువత ఎంత నీచానికైనా దిగజారుతారని సాక్ష్యాలతో నిరూపిస్తున్నానని పేర్కొంటాడు. డబ్బు దగ్గర విలువలు, వలువలకి ప్రాధాన్యత లేదని తాను కనుగొన్నానని స్పష్టం చేస్తాడు. ఇంతకీ రష్యన్లు పేర్కొంటున్నట్టు గ్రెగొరీ చెడిపోయిన బాలుడా?...తాను పేర్కొంటున్నట్టు సమాజానికి విలువలు గుర్తుచేసేవాడా? అంటే చెప్పడం కష్టమే.