: టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ బీజేపీ నేతలు


టీడీపీ నేతలపై బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కేంద్రం ఇచ్చిన నిధులతో మరుగుదొడ్లు కట్టిస్తామంటే టీడీపీ నేతలు తమను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు, నేతలు కన్నా లక్ష్మీనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు మీడియాతో మాట్లాడారు. మరుగుదొడ్ల నిర్మాణం జరిగితే టీడీపీ, బీజేపీ రెండు పార్టీలకు మంచిదని, ఏపీలో 24 గంటల విద్యుత్ కేవలం ప్రధాని నరేంద్ర మోదీ పుణ్యమేనని అన్నారు. మోదీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి 2019లో ఒంటరిగా పోటీ చేసి గెలుస్తామని వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News