: వైకాపా వరుస నిరసనలు... ఆపై ప్రధాని వద్దకు: జగన్


రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తుంటే, పట్టించుకోని చంద్రబాబు సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ, వచ్చే నెల 2న మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని పార్టీ వర్గాలకు వైకాపా అధినేత జగన్ సూచించారు. ఈ మధ్యాహ్నం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమైన ఆయన పలు అంశాలను చర్చించారు. తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో ప్రదర్శనలు చేయాలని, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా ఈ నెల 25న కాగడాల ర్యాలీ చేయాలని తెలిపారు. ఆపై మే తొలి వారంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్టు జగన్ వెల్లడించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులను సవరించాలని ప్రధానిని జగన్ కోరనున్నట్టు వైకాపా వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News