: ఒలింపిక్స్ పతకం సాధించెయ్!... జిమ్నాస్ట్ దీపాకు వైఎస్ జగన్ గ్రీటింగ్స్
ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళా జిమ్నాస్ట్ దీపా పర్మాకర్ కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ఏడాది రియోలో జరగనున్న ఒలింపిక్స్ కు దీపా నిన్న అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి మహిళా జిమ్నాస్ట్ గా రికార్డుకెక్కిన దీపా.. ఆ క్రీడల్లో పతకంతో తిరిగి రావాలని జగన్ ఆకాంక్షించారు. ఈ మేరకు నేటి ఉదయం ఆయన తన ట్విట్టర్ వేదికగా దీపాకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.